సునీల్.. కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే కమెడియన్ ఎంతగానో అలరించిన సునీల్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన అందాల రాముడు , మర్యాద రామన్న , పూల రంగడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ తర్వాత ఈయన అనేక సినిమా లలో హీరోగా నటించిన కూడా ఆ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. దానితో ఈయన మళ్ళీ సినిమాల్లో కామెడీ పాత్రలు చేయడం మొదలు పెట్టారు.
తన సెకండ్ ఇన్నింగ్స్ లో సునీల్ కేవలం కామెడీ పాత్రలే కాకుండా సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. అందులో భాగంగా పుష్ప ది రైజ్ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సునీల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.ప్రస్తుతం సునీల్ … సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎంతో హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సునీల్ ఈ మూవీ లో మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.ఈయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ లో సూపర్ స్టార్ మహేష్ సరసన శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా జనవరి 12 వ తేదీన విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.