టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.నిర్మాత నాగవంశీ సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాడని ప్రచారం జరిగింది.కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు కారం మూవీతో మాకు లాభాలు వచ్చినట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే గుంటూరు కారం మూవీ ఓ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. మహేష్ కు కోటగా భావించే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో అత్యంత వేగంగా రూ.కోటి గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలవడం విశేషం.
ఈ థియేటర్లో ఆడిన అన్ని మహేష్ బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.సంక్రాంతి సందర్భంగా రిలీజైన గుంటూరు కారం మూవీ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 17 రోజుల్లోనే రూ.కోటి గ్రాస్ వసూలు చేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. మహేష్ బాబుకు ఈ థియేటర్ ఎందుకంత స్పెషలో ఈ సినిమా మరోసారి నిరూపించింది. సుదర్శన్ 35 ఎంఎంలో రూ.కోటికిపైగా గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు ఏడో సినిమా ఇది.గతంలో మురారి (రూ.1.2 కోట్లు), ఒక్కడు (రూ.1.47 కోట్లు), అతడు (రూ.1.04 కోట్లు), పోకిరి (రూ.1.61 కోట్లు), మహర్షి (రూ.1 కోటి) మరియు సరిలేరు నీకెవ్వరు (రూ.1.06 కోట్లు) సినిమాలు కూడా రూ.కోటి కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే వీటన్నింటిలో గుంటూరు కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.