Gunmen Attacks: నరమేధం.. మార్కెట్లోకి ప్రవేశించి 47 మందిని కాల్చి చంపిన సాయుధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunmen Attack: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు రెచ్చిపోయారు. రెండు సార్లు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మార్కెట్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం సాయుధులు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం అదే ప్రాంతంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. ఈ కాల్పుల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియలేదు. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహించలేదని తెలిపారు.
అయితే, ఈ ప్రాంతంలో రైతులు, స్థానిక పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక పశువుల కాపరులే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
నైజీరియోలోని బెన్యూ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ‘నైజీరియా ఫుడ్ బాస్కెట్ ‘గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇక్కడ సమృద్ధిగా పంటలు పండతాయి. అయితే, కాపరులు తమ పొలాల్లో పశువులు మేపుతూ పంటలు నాశనం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములన్నీ తమకు చెందుతాయని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తరచూ జరిగే ఈ ఘర్షణల వల్ల రాష్ట్రం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయాయి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగదీస్తోంది.
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!