Gummanur Jayaram: కేబినెట్ నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం.. ఆ వెంటనే సాయంత్రం టీడీపీలో చేరారు. ఇక, ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనపై చర్చలకు దిగారు సీఎం జగన్.. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సిఫార్సు చేశారు సీఎం జగన్.. ఇక, సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్.. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు.. దీంతో.. గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినట్టు అయ్యింది.
Read Also: UPSC Recruitment: గుడ్‌న్యూస్.. 1,930 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Also Read
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
కాగా, అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తొలిసారి ఈ రోజు ఓ మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు.. మంత్రి గుమ్మనూరు జయరాం ఈ రోజు.. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం పేర్కొన్నారు.. సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని.. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఆ తర్వాత మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు గుమ్మనూరు జయరాం.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.. బడుగులకు స్వతంత్రం రావాలి.. టిక్కెట్లు బడుగులకిచ్చి.. అగ్ర కులాలకు ఇంఛార్జీలను ఇస్తే స్వతంత్రం ఉంటుందా..? అని టీడీపీ చేరిన తర్వాత వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
తాజావార్తలు
-
AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
-
Kailash Mystery: కైలాస పర్వతంపై శివుడు ఇప్పటికీ ఉన్నాడా? అసలు ఈ పర్వతాన్ని ఎందుకు ఎవరూ అధిరోహించలేకపోయారు?
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
-
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
ట్రెండింగ్
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!