ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1,930 యూపీఎస్సీ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం..
పోస్టుల వివరాలు..
రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జనరల్ కేటగిరీలో 892 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 193, ఎస్సీ- 235, ఎస్టీ-164, ఓబీసీ కేటగిరీ నుంచి 446 పోస్టులను భర్తీ చేస్తారు..
అర్హతలు..
బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరి పూర్తి చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి..
వయోపరిమితి..
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. ముందు ఆన్ లైన్ రాత పరీక్ష జరుగుతుంది. రెండోదశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్‌ను యూపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుంది..
జీతం..
ఈఎస్‌ఐసీ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.42,300 నుంచి రూ.63,300 వరకు ఉంటుంది.. ఆతరువాత పెరగవచ్చు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా UPSC అధికారిక పోర్టల్ https://upsc.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘What’s New’ అనే కేటగిరీలో ‘ESIC-నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.ఇక్కడ ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి… డీటెయిల్స్ ఫిల్ చేసి అనంతరం ఫీజు చెల్లించి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..