Site icon NTV Telugu

GT vs SRH: అభిషేక్‌ ఒంటరి పోరాటం వృథా.. హైదరాబాద్‌ను ఓడించిన గుజరాత్

Gt

Gt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 38 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగినా పోరాటం వృథా అయ్యింది.

Also Read:Viral News: “గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ దొరికిన కొడుకు”.. పబ్లిక్‌లోనే వాయించిన పేరెంట్స్..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఇది ఏడో విజయం. మరోవైపు, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ ల్లో ఏడో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం క్లిష్టంగా మారింది.

Also Read:Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డెట్.. విస్తీర్ణం 600 చ.అడుగులు మించొద్దు..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. ‘ఇంపాక్ట్ సబ్’ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి 27 బంతుల్లో 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రసిద్ధ్ కృష్ణ హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి తెరపడింది. హెడ్ ​​16 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్13 పరుగులు చేసి జెరాల్డ్ కోట్జీ బౌలింగ్ లో ఔటయ్యాడు. అభిషేక్ ఫామ్‌లో కనిపించి 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్ 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అభిషేక్, క్లాసెన్ మధ్య మూడో వికెట్‌కు 57 పరుగులను జోడించారు.

Also Read:Pakistan: ‘‘మహాప్రభో మమ్మల్ని కాపాడండి’’.. సౌదీ, యూఏఈ సాయం కోరిన పాక్ ప్రధాని..

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభం లభించింది. పవర్‌ప్లేలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరి మధ్య 41 బంతుల్లో 87 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఉంది. సుదర్శన్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. సుదర్శన్ ఔటైన కొద్దిసేపటికే, శుభమన్ 25 బంతుల్లో తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. శుభమన్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. శుభ్‌మాన్, జోస్ బట్లర్ రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శుభమాన్ ఔట్ అయిన తర్వాత, బట్లర్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కేవలం 31 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

Exit mobile version