Gujarat: గుజరాత్లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: భారత్‌లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కోట్లలో వ్యాపారం చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ పౌరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినా వారి కళ్లు కప్పి డ్రగ్స్, మత్తుపదార్థాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.
తాజాగా, గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్ బోటులో అక్రమంగా తరలిస్తుండగా కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఈ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్థాన్ పడవను అక్టోబర్ 8న పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 కిలోల హెరాయిన్‌ను కోస్ట్ గార్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read Also: Book Fair in Hyderabad: బాక్స్ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ రేపటి వరకే
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటీఎస్ గుజరాత్‌తో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఈ ముఠా పట్టుబడింది. వాటితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు, సెప్టెంబర్ 14న, సుమారు రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను పాకిస్తానీ బోటు నుంచి పట్టుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!