CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రిజర్వాయర్లు, నదుల్లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్థాయి వరకు సూచనలు జారీ చేయాలని చంద్రబాబు సూచించారు. వాయుగుండం తీరం దాటినందున వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, ఈ రోజు, రేపు కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎంత మేర పంట నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో అంచనా వేసి నివేదిక సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ఈ రోజు కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లోకి వస్తున్న ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం, ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం చంద్రబాబు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఏఎస్ఆర్, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. వాయుగుండం ఈ రాత్రి ఒంటిగంట సమయంలో పోలాకి వద్ద తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!