Site icon NTV Telugu

Guduri Srinivas: అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలి..

Guduri Srinivas

Guduri Srinivas

Guduri Srinivas: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలగానూ 11 స్థానాలు బీసీలకు కేటాయించి వైసీపీ పెద్దపేట వేస్తోందని వివరించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న సీఎం జగన్ మళ్లీ అధికారం రావాలని ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.

Read Also: TDP: బిగ్ ట్విస్ట్.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు..

అభివృద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు గూడూరి శ్రీనివాస్ . అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు. గతంలో విభేదాల కారణంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్లో వైసీపీ ఓటమి చెందిందని, ప్రస్తుతం వైసీపీలో ఎటువంటి విభేదాలు లేవని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ రోల్ మోడల్ తీసుకుని ముందుకు వెళతానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు శ్రీనివాస్ కోరారు.

Exit mobile version