Group 1 Controversy: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకు కాబోయే భార్య గురించి న్యాయపోరాటం చేసేందుకు మీడియా ముందుకు వచ్చాడు.. సోమాజీగూడ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ యువకుడు మాట్లాడాడు. తనకు, గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన అమ్మాయికీ పెళ్లి మాట ముచ్చట అయ్యిందని తెలిపాడు.. ఉద్యోగం వచ్చిన తర్వాత నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని.. ఇప్పటికీ ఎందురు చూస్తున్నామన్నాడు. నాతో పెళ్లి సంబంధం సెట్ అయిన అమ్మాయి ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంక్ తెచ్చుకుంది.. తను చిన్నప్పటి నుంచి చదువుల్లో నెంబర్ 1 అని ఆధారాలు సైతం మీడియాకు చూయించాడు.
READ MORE: Gaza-Israel: గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు.. తగలబడుతున్న భారీ భవంతులు
ఆ యువకుడు మాట్లాడుతూ.. “నేను ఆమెకు కోచింగ్ ఇప్పించాను. ఆమె బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. తాను 10th లో టాపర్, ఇంటర్లో టాపర్, డిగ్రీలో కోటీ ఉమెన్స్ కాలేజీలో గోల్డ్ మెడల్ తీసుకుంది. ఓయూలో పీజీ చేసింది. ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకుంది. ఇవన్నీ ప్రూప్స్. ఇప్పటి వరకు మేము బటయకు రాలేదు. నిజం గడపదాటేలోపు అబద్ధం దేశమంతా చుట్టివచ్చింది. అందుకే ఇవన్నీ చేప్పుకోవాల్సి, చూయించాల్సి వస్తుంది. ఈ పరీక్ష అయిపోయి ఏడాది అవుతోంది. ఈ వన్ ఇయర్ పాటు మేము వేచి చూస్తున్నాం. ఎందుకంటే నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. యవ్వనం తాకట్టు పెట్టి మరీ చదివిస్తున్నాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఎప్పుడు లేఆఫ్స్ అవుతాయో తెలియదు. మేము ఎలాగో వెనకబడిన తరగతి నుంచి వచ్చాం. కానీ మా ముందుతరం ఇలా కావొద్దని యవ్వనం తాకట్టు పెట్టాం. ఇప్పటికీ మ్యారెజ్ చేసుకోలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు పుట్టడం ప్రాబ్లమ్ అవుతుందని మాకు తెలుసు. తెలిసినా కూడా మా ముందుతరాల కోసం ఇది చేస్తున్నాం. మేము జన్యూన్ క్యాండిడెట్స్ . మా ముఖం చూస్తే మీకే అర్థం అయి ఉంటుంది. మీడియా కూడా మాకు సపోర్టు చేయాలి.” అని ఆవేదన వ్యక్తం చేశాడు.