Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Group 1 Candidates Demanded Cbi Enquiry On Group 1 Results

Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్

Published Date :June 3, 2022 , 1:29 pm
By Ramesh Nalam
Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి తొలగించారని.. గతంలో సిద్ధం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ఓ గ్రూప్-1 అభ్యర్థి గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారో చెప్పాలని గ్రూప్-1 అభ్యర్థులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ఫలితాలు నిలిపివేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు. డిజిటల్ వాల్యూయేషన్‌ అంతా పారదర్శకంగానే జరిగిందని చెప్పారని.. కానీ ఇప్పుడు అభ్యర్థులనే మార్చి తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అర్హత లేనివారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐతో విచారణ చేయించి 202 మందికి న్యాయం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Chandrababu : ఆ నిబంధన రాష్ట్ర దుస్థితికి.. అసమర్థ పాలనకు నిదర్శనం

కాగా గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్‌ను కలవడానికి వచ్చిన సమయంలోనే రాజ్ భవన్‌కు ఏపీపీఎస్సీ అధికారి గౌతమ్ సవాంగ్ వచ్చారు. ఆయన యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రూప్-1 ఫలితాల విషయంలో తాజా పరిణామాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CBI
  • Governor
  • Group 1
  • Raj Bhavan

తాజావార్తలు

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions