Thummala Nageswara Rao: తెలంగాణ మంత్రి తుమ్మలను మర్యాద పూర్వకంగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (G.R.M.B ) చైర్మన్ ఎం.కే సిన్హా కలిశారు. హైదరాబాద్ లో ఉన్న మంత్రి తుమ్మల నివాసంలో జీ.ఆర్.ఏం.బీ చైర్మన్ సిన్హా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బుధవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై, నీటి కేటాయింపులుపై మంత్రి తుమ్మల చర్చించారు. భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు తెగిన పెద్దవాగు ప్రాజెక్ట్ రీ డిజైన్ పై చర్చించారు. మూడు గేట్లు నుంచి ఆరు గేట్లకు పెంచి 80 వేల క్యూసెక్కుల నీరు డిచ్చార్జ్ అయ్యేలా పెద్దవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
UP crocodile Video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ మొసలి.. జనాలు పరుగులు
పెద్దవాగు ఉమ్మడి ప్రాజెక్ట్ గా ఉండటంతో ఏపి, తెలంగాణ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దవాగు పరిధిలో 16 వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా.. ఎవ్వరీ పరిధిలో వారు కాలువల మరమ్మత్తులు వారే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడాలని రాష్ట్ర వాటాకు ఇబ్బందులు లేకుండా కేటాయింపులు అమలు చేయాలని, ఇరు రాష్ట్రాలకు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా చూడాలని, పెండింగ్ ప్రాజెక్ట్ లపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎం.కే సిన్హా తో సుదీర్ఘంగా చర్చించారు. ఏటా భారీగా గోదావరి జలాల వృధా అవుతున్నాయని.. అలా కాకుండా తెలంగాణ వినియోగించుకునేలా ఎలాంటి కార్యాచరణ చేపట్టవచ్చనే అంశాలపై చర్చించారు.