Anand Bose: హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ.. రాష్ట్రపతి పాలనపై ఊహాగానాలు!
- హోంమంత్రి అమిత్ షాతో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ
- ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై చర్చ
- జోరుగా.. రాష్ట్రపతి పాలన విధించవచ్చనే ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గవర్నర్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలోని తాజా సమస్య అయిన మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి సంబంధించిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆనందర్ బోస్ ఈ కేసుకి సంబంధించిన సమగ్ర వివరాలు షాకి సమర్పించనున్నారు. గత వారం కూడా గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్లను కలిశారు. ఆర్జీకర్ ఆస్పత్రి కేసును తెలియజేశారు.
READ MORE: Mathu Vadalara 2 Teaser: వెల్కమ్ టు ‘హీ’ టీమ్.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
హోంమంత్రితో గవర్నర్ భేటీ తర్వాత పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చా అనే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. వాస్తవానికి.. కోల్‌కతాలోని ఆర్జి కర్ హాస్పిటల్లో అత్యాచారం-హత్య కేసు తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా గవర్నర్ అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్
సీవీ ఆనంద్ బోస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, బెంగాల్ పోలీసులను నేరస్థులని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన బాధ్యతను ఏమాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అలాగే, పోలీసు కమిషనర్‌ను కూడా వెంటనే తొలగించాలన్నారు. తాను బెంగాల్ ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటానన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!