Andhra Pradesh: టీచర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ప్రభుత్వ టీచర్లకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసిన సర్కార్.. ఇప్పుడు ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ ప్రక్రియను మే నెలాఖరులోగా పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.. కాగా, గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే కాగా.. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించారు.
రాష్ట్రంలో విద్యా వ్యస్థలను కీలక మార్పులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ సర్కార్.. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియకు పూనుకుంది. 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానుండగా.. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు అధికారులు.. అందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అవసరం పడనున్నట్టు లెక్కలు తేల్చారు.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్‌లో నియమించేందుకు సిద్ధం అయ్యారు.
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!