Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన చివరిగా ‘భీమా’ (Bhimaa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో మెప్పించినా, కమర్షియల్ గా ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా గోపీచంద్ తన తదుపరి చిత్రం కోసం ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.
Also Read : Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ఆయన 33వ సినిమా (#Gopichand33) టైటిల్ గ్లింప్స్‌ను రేపు (ఏప్రిల్ 13, సోమవారం) ఉదయం 11:17 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధికారికంగా ప్రకటించింది. “An untold chapter from a timeless age of glory” అంటూ వచ్చిన క్యాప్షన్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇందులో భక్తి, పురాణ నేపథ్యం ఉన్నట్లు హింట్ ఇస్తూ మేకర్స్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి (Sankalp) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విలక్షణమైన సినిమాలతో తన మార్క్ చాటుకున్న సంకల్ప్, ఇప్పుడు గోపీచంద్‌ను ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నారు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, గోపీచంద్ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ గ్లింప్స్‌తో ఈ సినిమా కథేంటనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!