Google: ఉద్యోగులకు ఫ్రీ స్నాక్స్, లంచ్ కట్.. పొదుపులో భాగంగా గూగుల్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి. దీంతో వీటిని తగ్గించి పొదుపు చేయాలని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీసెస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాల్ని కంపెనీ తగ్గించడం లేదా పూర్తిగా తొలగించేందుకు సిద్ధం అయింది. దీంతో పాటు కొత్త నియామకాల ప్రక్రియను కూడా కంపెనీ నిలిపేసింది.
Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం
Also Read
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
ఉచితంగా స్నాక్స్, లంచ్ ఇతరత్రా సేవలకు గూగుల్ ప్రసిద్ధి. అయితే ఇప్పుడన్నీ కూడా గతం కానున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వాటికి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతం అంటే 12,000 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. గూగుల్ మాత్రమే కాదు ఇతర కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. మొదటగా ఉద్యోగులను తొలగించి ఖర్చులను అదుపులోకి తీసుకురావాలని అనుకున్నాయి. దీంతోనే దిగ్గజ ఐటీ కంపెనీలు అయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించాయి. ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయం తగ్గడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నాయి.
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.