Whats Today Updates 20.07.2022
1. నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్ట పెంపుపై పార్లమెంటులో నేడు విపక్షాలు నిరసన తెలుపనున్నాయి.
2. నేడు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల చేయనుంది టీటీడీ. ఆగస్టు నెల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
3. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
4. నేడు జంతర్‌మంతర్ వద్ద కేఏ పాల్ ధర్నా చేయనున్నారు. ఏపీ విభజన చట్టం హామీలు నెరవేర్చాలని డిమాండ్.
5. నేడు శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పీఠానికి త్రిముఖ పోరు జరుగనుంది.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,510 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.60,700 లుగా ఉంది.