ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం ఇది నాల్గవసారి.
దీని కారణంగా, HDFC, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ వంటి పెద్ద బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు నిలిచిపోయాయి. ట్రాన్సాక్షన్స్ లో అంతరాయం కలిగింది. సాయంత్రం 7:45 గంటల నుంచి, Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లలో ట్రాన్సాక్షన్ చేయడంలో ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రజలు డబ్బును బదిలీ చేయలేకపోయారు. రాత్రి 8 గంటల నాటికి, 2,200 కంటే ఎక్కువ మంది డౌన్‌డిటెక్టర్ అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదులను నమోదు చేశారు. ఈ ఫిర్యాదులలో దాదాపు 80 శాతం చెల్లింపు వైఫల్యం గురించి తెలిపారు.
