మ్యాజిక్ ఎడిటర్ (Magic Editor) అనేది శక్తివంతమైన Google Pixel AIకి సంబంధించిన ఎడిటింగ్ యాప్. ఇది మే 15వ తేదీ ప్రారంభించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)ని ఉపయోగించి, మ్యాజిక్ ఎడిటర్ యూజర్లు తీసిన ఫోటోలను మరింత స్పష్టంగా చూపగలదు. మీరు గూగుల్ ఫోటోల యూజర్ అయితే దీనికి సులభంగానే యాక్సెస్ పొందొచ్చు. గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ప్రయోజనం ఏంటంటే.. ఇది క్లిష్టమైన ఫోటోల నుంచి కదిలే వస్తువులను కూడా సులభంగా తొలగించగలదు. అంతేకాదు ఫోటో నేపథ్యాన్ని కూడా మార్చగలదు. ఇది Google నుంచి అత్యంత శక్తివంతమైన AI పవర్డ్ ఫోటో ఎడిటింగ్ యాప్. తాజాగా గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ యాప్‌ని అందరూ వాడొచ్చని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లందరికీ గూగుల్ ఈ సర్వీసులను ఉచితంగా అందించనుంది. ప్రారంభంలో కేవలం Pexel 8, Pexel 8Pro సిరీస్‌లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు గూగుల్ ఫోటోలను వాడే యూజర్లందరికీ ఉచితంగా అందించనుంది.
READ MORE: Smoky Paan: ‘స్మోకీ పాన్’ తిన్న బాలిక పేగుకు రంధ్రం..
మ్యాజిక్ ఎడిటర్ అందరికీ ఉచితమే కానీ.. కొన్ని షరతులను పెట్టింది గూగుల్. మీకు నచ్చిన విధంగా ఎక్కువగా ఫోటో ఎడిటింగ్ చేయడానికి ఈ యాప్ పర్మిషన్ ఇవ్వదు. ప్రతి ఒక్క యూజర్ మ్యాజిక్ ఎడిటర్‌లో గరిష్టంగా 10 ఫోటోలను మాత్రమే ఎడిట్ చేయగలరు. అంతకంటే ఎక్కువ ఫోటోలు ఎడిట్ చేయాలంటే, మీరు Google One ప్రీమియం(2+TB)ప్లాన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదా పిక్సెల్ యూజర్ అయ్యుండాలి. అంతేకాదు.. ఈ ఎడిటర్ యాప్‌ని వాడాలంటే, మీ ఫోన్‌లో తప్పనిసరిగా 64Bit Processer, android 8 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్, 4GB RAM ఉండాలి.
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్‌తో పాటు అనేక ఇతర యాప్స్ ఫ్రీగా రూపొందించారు. ఇవన్నీ యూజర్లకు ఉచితంగా అందించబడిన ఇతర AI పవర్డ్ యాప్స్. వీటిలో మ్యాజిక్ ఎరేజర్, HDR Effects, Portrait Blur, unblur, sky suggestion, కలర్ పాప్, సినిమాటిక్ ఫోటోస్ తదితర యాప్స్ ఉన్నాయి. ఈ ఎడిటింగ్ యాప్ కేవలం ఫోటోల కోసమే కాదు.. వీడియోల కోసం కూడా ఉపయోగించొచ్చు. ఈ యాప్స్, ఫీచర్లు గూగుల్ పిక్సెల్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నెలల్లో అందరికీ ఈ ఆప్షన్ లభించనుంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ లేని వారు గూగుల్ ఫోటోల ద్వారా మ్యాజిక్ ఎడిటర్‌ను కూడా యాక్సెస్ చేయొచ్చు.