స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు. కటక్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మహిళలకు రుతుక్రమంలో ఎలాంటి సెలవులు ఇవ్వడం లేదన్నారు.
Read Also: Waiting IPS Officers: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!
ఇప్పుడు ఒకరోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. ఈ తాజా ప్రకటనతో.. మహిళలు పీరియడ్స్ సమయంలో మొదటి రోజు లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ సెలవు మహిళకు ఇష్టముంటూనే తీసుకోవచ్చు.. మహిళ సెలవు కావాలని కోరితే మాత్రమే సెలవు పొందుతారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
Read Also: Fever – Food: జ్వరంతో బాధపడుతున్నారా..? అయితే వీటి జోలికి అసలు పోవద్దు..