స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీరియడ్ లీవ్ మంజూరు కోసం ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ పిటిషన్ దాఖలైంది.