Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు
- ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించారు
- ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంచుతున్నట్లు తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంచుతున్నట్లు తెలిపారు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనున్నది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
Also Read:Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్ సీఎం ఇతడేనా?
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
చివరగా జూలై 2025 లో కూడా 2.1% DA పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జూలై 2025 లో 48.6% నుండి 50.7% కి పెంచారు. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏ తో 52.8 % కి చేరింది. మే 2024 లో RPS – 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవు.. డీఏ లో పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ను అభినందించారు ఆర్టీసీ ఎండీ ఇతర ఉన్నతాధికారులు.
ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు.. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసింది.. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది.. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరిందన్నారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో మొదటి నుండి ఆర్టీసి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుంది.. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్ గ్రెడేషన్ ,కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం ,కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది.. పెండింగ్ లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగింది.
Also Read:Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు
తెలంగాణ లో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇది ఉపయోగపడుతుంది.. తెలంగాణ లో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీ నీ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏ ను ఈరోజు ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయని నాగిరెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!