Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూడాలని నాని చేసిన ఒక చిన్న రిక్వెస్ట్.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌ల దాకా వెళ్లి సంచలనంగా మారింది. నాని రాకతో గతంలో జరిగిన ఒక విషాదాన్ని డీజీపీ గుర్తు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తాను మొదటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో జనాలతో కలిసి సినిమా చూడటాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తానని, ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ (సెప్టెంబర్ 23) రోజున అభిమానుల మధ్య సినిమా చూడాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నాని కోరారు. భద్రతా నిబంధనలన్నీ కచ్చితంగా పాటిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు. యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాపై నానికి ఉన్న నమ్మకాన్ని అభినందిస్తూనే.. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని, వాళ్లే పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు.
సీఎం సూచనతో సీన్లోకి ఎంటర్ అయిన డీజీపీ సీవీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల కోలాహలం తారాస్థాయిలో ఉందని, హుస్సేన్ సాగర్‌కు వెళ్లే దారిలో ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియా అంతా ట్రాఫిక్, జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో నాని లాంటి స్టార్ వస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడం చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇలాంటి రద్దీ సమయంలో జరిగిన ఒక తొక్కిసలాటలో (స్టాంపేడ్) ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, ఒక చిన్నారికి శాశ్వత అంగవైకల్యం ఏర్పడిందని డీజీపీ ఆనాటి చేదు సంఘటనను గుర్తు చేసి హై అలర్ట్ చేశారు. ఆ అనుభవాల దృష్ట్యా సిటీ పోలీసులతో చర్చించాకే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.
Also Read
నిమజ్జనం రద్దీ, డీజీపీ సూచనతో దృష్ట్యా నాని వెంటనే వెనక్కి తగ్గారు. పోలీసుల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తానని, పబ్లిక్ సేఫ్టీయే తమకు ముఖ్యమని సీఎం రేవంత్‌కు రిప్లై ఇచ్చారు. రాత్రింబవళ్లు నిమజ్జనం డ్యూటీలో ఉన్న పోలీసులకు తన వల్ల ఏమాత్రం అదనపు భారం పడకూడదని, ట్రాఫిక్ లేదా క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా రిస్క్ ఉంటే తాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పర్యటనను సంతోషంగా విరమించుకుంటానని నాని ఎంతో మెచ్యూర్డ్‌గా బదులిచ్చారు. ఏదేమైనా.. నాని వస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టమని, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్వయంగా పోలీసు బాస్ వార్నింగ్ ఇవ్వడం.. ‘ది ప్యారడైజ్’ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెబుతోంది.
తాజావార్తలు
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
-
Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
-
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
-
JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!