Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- ‘స్ప్లిట్ వెర్డిక్ట్’గా మారిన వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అనే అంశంపై ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
2023లో తీసుకొచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తొలగించడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో సీజేఐ పాత్ర ఉండగా.. 2023 చట్టం ప్రకారం ఎంపిక ప్యానెల్లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే విధానం వచ్చింది. ఈ మార్పు రాజ్యాంగబద్ధతపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
అయితే ఈ పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సిన అవసరం ఉందా? అనే విషయంలో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించారు. మరోవైపు జస్టిస్ ఎస్సీ శర్మ మాత్రం ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి రిఫర్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఇలా ఇద్దరూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది.
ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇది ‘స్ప్లిట్ వెర్డిక్ట్’గా మారింది. దీంతో పిటిషన్లపై తుది నిర్ణయం వెంటనే వెలువడదు. తదుపరి న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ఈ భిన్నాభిప్రాయాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా 2023 చట్టంలోని సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం రాజ్యాంగబద్ధమేనా? ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? వంటి అంశాలు పరిశీలనకు రానున్నాయి.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!