NTV Telugu Site icon

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!

Cricket

Cricket

గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉండి.. గాయాలతో బాధ పడుతున్న టీమిండియా ఆటగాళ్లు జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ ప్లేయర్స్ టీమ్ లో చేరితే.. ఇంకా బలం చేకూరినట్లవుతుంది. ప్రపంచకప్ ముందు జట్టులో చేరితే ఇంకేముంది.. ప్రత్యర్థులకు హడలే. అయితే ఆ ఆటగాళ్లకు సంబంధించి బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.

Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి

ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లు బుమ్రా మరియు ప్రసిద్ధ కృష్ణ వారి పునరావాసం చివరి దశకు వచ్చింది. వారిద్దరూ నెట్స్‌లో పూర్తి శక్తితో బౌలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరూ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఆ మ్యాచ్ లను NCA నిర్వహించనుంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ల తర్వాత బుమ్రా, కృష్ణలపై వైద్య బృందం తుది నిర్ణయం తీసుకోనుంది.

Heavy flood: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద
అంతేకాకుండా భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఫిట్‌నెస్ కోసం కసరత్తు చేస్తున్నారు. వారి పురోగతిపై బీసీసీఐ వైద్య బృందం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వారి నైపుణ్యం, కండిషనింగ్ ఆధారంగా ఇద్దరికీ పనిభారం పెరుగుతుంది. వీరితో పాటు రిషబ్ పంత్ కూడా పునరావాసంలో చాలా మంచి పురోగతి ఉంది. నెట్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కూడా ఫాలో అవుతున్నాడు.