Chada Venkat Reddy Fires On PM Modi Over Manipur Incident: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ దుర్మార్గానికి వాళ్లిద్దరే బాధ్యత వహించాలని అన్నారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పి, కుకీ గిరిజన వర్గానికి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన మణిపూర్ ఘటనపై జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు. అలాగే.. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతోనూ డిపోల ముందు ధర్నాలు చేపడతామన్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రజాసమస్యలపై కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో సీఎం కేసీఆర్ విఫలమాయ్యారని విమర్శించారు.
Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
అంతకుముందు కూడా.. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు చాడ వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. నేటికి గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించలేదని, దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తులు పెరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీల్లోని ఆయా విభాగాల్లో మొత్తం 50,000 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్లు చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పీఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడంతో పాటు వేతనాలకు పెంచాలని, ఇతర న్యాయమైన డిమాండ్లని కూడా పరిష్కరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Gudivada Amarnath: లారీ ఎక్కి ఊగిపోతే ఎలా తెలుస్తుంది..? పవన్‌పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు