బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ‘పఠాన్’ మరియు ‘జవాన్’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో వున్నారు.ఈ రెండు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపించాయి.ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ‘డంకీ’. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా లో తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డంకీ సినిమా విడుదల అయిన తరువాత రోజే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కానుంది. దీనితో ఈ రెండు పాన్ ఇండియా సినిమాలకు బాక్స్ఆఫీస్ వార్ జరుగనుంది..
ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ‘డంకీ’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా లో వెల్లడించింది. ఇక ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎగబడుతుండగా.. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపం లోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్ర బృందం ధీమాగా ఉంది డంకీ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్ లో హిరానీ మరియు గౌరీ ఖాన్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో బోమన్ ఇరానీ,విక్కీ కౌశల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.