NTV Telugu Site icon

World Cup Final: ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఢిల్లీ టూ అహ్మదాబాద్‌ స్పెషల్ ట్రైన్

Train

Train

స్వదేశంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ అంటే ఎంత ఖర్చు పెట్టైనా స్టేడియంకు వెళ్లి చూడాల్సిందే అంటున్నారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వేరే రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్కు వెళ్లేందుకు ఏది దొరికితే అందులో వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వెళ్లేందుకు విమానయాన ఛార్జీలు విపరీతంగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: Adimulapu Suresh: చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేశారు..

రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త. అహ్మదాబాద్ వెళ్లాలంటే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు విమాన ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో.. రైల్వేశాఖ కీలక నిర్ణయంతో అహ్మదాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది.

Read Also: Pat Cummins: మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.. పిచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!

కాగా, ఈ స్పెషల్ ట్రైన్ టికెట్ ధర గురించి మాట్లాడితే.. స్లీపర్‌కు రూ.620. ఫస్ట్ ఏసీ కోసం ప్రయాణికులు రూ.3490 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా.. 3 AC ఎకానమీ, 3 AC సీట్ల ధర రూ.1525, రూ.1665గా ఉంది. ఈ స్పెషల్ ట్రైన్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరుతుంది. రేపు ఉదయం అక్కడికి చేరుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ ఢిల్లీకి బయలుదేరుతుంది. దీంతోపాటు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య మూడు స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది భారతీయ రైల్వే.