క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి వైఎస్‌ఆర్ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Read Also: Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ..
ఈ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో జరగబోయేది మూడో మ్యాచ్ అని.. గత మ్యాచ్ లలో చోటు చేసుకున్న లోటు బాట్లుపై చర్చించామని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్ లను,సెక్రెటరీలకు ఆహ్వానం ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో 27 వేల మంది కూర్చునే కెపాసిటీ ఉందని అన్నారు. అంతేకాకుండా.. విశాఖ బీచ్ రోడ్డులో 10 వేల మంది వీక్షించేందుకు ఐపీఎల్ తరహా ఫ్యాన్ పార్క్స్, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Read Also: Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత
జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్లేయర్స్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ పై అందరి ఎక్సపెటేషన్స్ రీచ్ అయ్యేలా గ్రాండ్ ఎరేంజ్మెంట్స్ చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ డే రోజు పార్కింగ్, ట్రాఫిక్ లపై పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని సీపీ రవి శంకర్ అయ్యర్ అన్నారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత నడుమ నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 2 వేల మంది వరకు విధుల్లో పాల్గొంటామన్నారు.