ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడు లేదా హీరో నుండి తర్వాత వచ్చే సినిమాలకు విపరీతమైన డిమాండ్, బజ్ ఉండడం సహజం. కానీ ఇండస్ట్రీ డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుని సినిమాకు అలాగే ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన హీరో సినిమాకు అదిరిపోయే డిమాండ్ ఉండడం అంటే మాటలు కాదు. అది కొందరికే సాధ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు, హీరో కూడా ఆ కోవకు చెందిన వారే అనడంలో సందేహం లేదు.
వివరాలలోకి వెళితే దర్శకుడు పూరి జగన్నాధ్ ఒక హిట్ ఒక ఫ్లాప్ తో ఆలా నడుస్తోంది ఈ దర్శకుని కెరీర్. గతేడాది పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఇండస్ట్రీ డిసాస్టర్లలో ఒకటి. ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం తాలుకు పంచాయితీ ఇంకా నడుస్తూనే ఉంది. మరో వైపు వారియర్, స్కంధ వంటి చిత్రాల్లో నటించి వరుస ఫ్లాప్ లు అందుకున్నాడు రామ్ పోతినేని. నేడు వీరి కలయికలో రాబోతున్న సినిమానే డబుల్ ఇస్మార్ట్.
2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించింది. వీరిద్దరికి అదే లాస్ట్ హిట్. నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ కు కిరాక్ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది ఈ చిత్రం. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రూ. 60 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 9కోట్లు, సౌత్ ఇండియా డిజిటల్ రైట్స్ రూ.33 కోట్లు, తెలుగు, హిందీ డిజిటల్ మరియు శాటిలైట్ రూ.50 కోట్లు అటుఇటుగా అమ్ముడయ్యి ఇండస్ట్రీ సర్కిల్స్ ను ఆశ్చర్య పరిచింది రామ్, పూరీలా డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.