టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకోని తన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులో ఉన్నా , పర్సనల్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నా కూడా డేలీ చేసే రొటీన్ ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ అవ్వదు.రెండు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. 2023కి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2024ను అందరూ ఆహ్వానించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. వారిలో సమంత కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది.అయితే, సమంత ఈ ఇయర్ ఎండింగ్‌ను వర్కౌట్స్‌తో ముగించనుంది.సమంత బరువైన డంబెల్ పైకి లేపి మరి 2023ని ముగిస్తున్నట్లు తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీడియో షేర్ చేసింది. “2023లో చివరిసారిగా వర్కౌట్ చేయడం ప్రారంభమైంది. ఈ సంవత్సరాన్ని మేము ఇలా ఎక్సర్ సైజ్‌తో ముగించనున్నాం” అంటూ వీడియోను తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.సోషల్ మీడియాలో సమంత 2023 ఇయర్ ఎండింగ్ వర్కౌట్ వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా మరియు గ్రే హై వెయిటింగ్ టైట్స్ ధరించింది. అందులో సమంత ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్సర్ సైజ్ చేస్తోంది. దాని వల్ల భుజం కండరాలు బలంగా అలాగే పెద్దవిగా అవుతాయి. అలాగే ట్రైసెప్స్, ట్రాపెజియస్ కండరాల బలానికి ఈ వ్యాయామయం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ వీడియోలో సమంత బ్యూటిఫుల్ మజిల్స్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది సమంత సమంత ఇటీవల విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.సమంత ఈ ఏడాది ఖుషి సినిమాతో పాటు బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.సిటాడెల్ సిరీస్‌లో సమంతతోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. దీనికి డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్నారు. వీరు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, ఫర్జీ మరియు గన్స్ అండ్ గులాబ్స్ సిరీసులు తెరకెక్కించారు.