Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
- కన్యాకుమారి రేప్-మర్డర్ కేసును 6 గంటల్లో ఛేదించిన పోలీసులు..
- మృతురాలి గోల్డ్ రింగ్, సీసీటీవీ ఫుటేజీతో పట్టుబడ్డ నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిందితుడ్ని కేవలం 6 గంటల్లో పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ‘‘బంగారు ఉంగరం’’ కీలకంగా మారింది. గుర్తుతెలియని మహిళను గుర్తించేందుకు ఆ ఉంగరంపై ఉన్న హాల్ మార్క్ వివరాలు పోలీసులకు ఉపయోగపడ్డాయి. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో నిరుపయోగంలో ఉన్న రైల్వే బోగీలో 54 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 13 అర్ధరాత్రి ఈ నేరం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి వివరాలు చెప్పిన గోల్డ్ రింగ్..
మృతురాలి వివరాలను ముందుగా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈక్రమంలో పాము ఆకారంలో ఉన్న బంగారు ఉంగరం వారి దృష్టిలో పడింది. దానిపై ఉన్న హాల్ మార్క్ వివరాలే కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాయి. ఉంగరం పై ఉన్న హాల్ మార్క్ ఆధారంగా దాని మూలాలు గుజరాత్లో గుర్తించారు. దీనిని అమ్మిన వ్యాపారిని సంప్రదించగా.. దీనిని ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ రిటైలర్‌కు సరఫరా చేసినట్లు వెల్లడివంచారు. దీని ఆధారంగా మహిళ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత మూడు నెలలుగా ఆమె స్వస్థలంలో కనిపించకుండా పోయిందనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు కన్యాకుమారికి బయలుదేరారు.
Also Read
- Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
- Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
- TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
6 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు..
మృతురాలి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అత్యంత వేగంగా గుర్తించారు. తొలుత ముగ్గురు అనుమానితులపై పోలీసులు దృష్టి పెట్టారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఈ కేసులో కీలకంగా మారింది. తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రైల్వే బోగీ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తిరిగే బిచ్చగాడిగా గుర్తించారు. గతంలో అతడికి మృతురాలు కొన్ని సందర్బాల్లో ఎదురైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను నిరుపయోగంగా ఉన్న బోగీలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ధరించిన, రక్తం మరకలు ఉన్న చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించినందుకు తమిళనాడు రైల్వే డీజీపీ కె. వన్నియా పెరుమాళ్ పోలీసుల దర్యాప్తును, ముఖ్యంగా రైల్వే ఎస్పీ కృషిని అభినందించారు.నిందితుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చేతులతో దాడి చేసి, ఛాతీపై తన్నడం ద్వారా హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!