Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today on December 18th 2023 in Hyderabad: ఇటీవలి కాలంలో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లే ఉంది. మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. సోమవారం స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,510గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,660గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,160గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,510గా కొనసాగుతోంది.
Also Read
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్ర పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
Also Read: KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలేదు!
మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగానే ఉంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర సోమవారం రూ. 77,700లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,700లు ఉండగా.. చెన్నైలో రూ. 79,700గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 79,700లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,700 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్ర పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!