Gold Price Today in Hyderabad on 17th September 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,890గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,040గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,890గా కొనసాగుతోంది.
Also Read: DK Aruna : ఫాంహౌజ్ ముఖ్యమంత్రికి ఇవ్వాళ పాలమూరు గుర్తొచ్చింది
మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉండగా.. చెన్నైలో రూ. 78,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,200ల వద్ద కొనసాగుతోంది.