Gold Rate Today in Hyderabad and India on 7 June 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు.. రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ భారీగా పెరిగాయి. ఈ రెండు రోజులో తులం బంగారంపై రూ.1000 పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం పెళ్లిళ్ల సీజన్ ఉండటమే అని తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 పెరిగింది. శుక్రవారం (జూన్ 7) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,750గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
శుక్రవారం హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,750గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.67,750 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,900గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,750గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,750గా ఉంది.
Also Read: Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!
నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.2,500 పెరిగి.. 96 వేలకు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,000 ఉండగా.. ముంబైలో సైతం రూ.96,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,00,500లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.93,250గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,00,500లుగా ఉంది.