Gold Prices: దేశంలో బంగారం ధరలు తక్కువయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించడంలేదు. పసిడి ధరలు రోజురోజుకు పైపైకి దూసుకెళ్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల పెరుగుదల దూకుడుగా కొనసాగుతోంది. ప్రస్తుతం చూస్తుంటే బంగారం ధర లక్ష రూపాయలు దాటి వెళ్లేలా అర్థమవుతోంది. ఇక ఈరోజు బంగారం ధర మరోమారు స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,700 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 390, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350 పెరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. తులం బంగారు పై 290 రూపాయలు పెరిగి రూ.66,030 ట్రేడ్ అవుతోంది.
Also Read: Kashmiri MBBS Student: ఎంబీబీఎస్ విద్యార్థిని ర్యాగింగ్.. సిద్ధరామయ్యకు లేఖ రాసిన జమ్మూ సీఎం
ఇక వెండి ధరలు మాత్రం కాస్త స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఒక కిలో వెండి ధర రూ. 1,00,800 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. గ్లోబల్ ఎకానమీ అనిశ్చితి, డాలర్ మార్జిన్ పెరుగుదల, ముడి చమురు ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉండటం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు దీన్ని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో బంగారం కొనాలని భావించే వారిపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తోంది. మరోవైపు బంగారం షాప్ యజమానులు గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు.