Gold Rate Today in Hyderabad on 20th September 2023: రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. గత 4-5 రోజులుగా పెరిగిన పసిడి ధరలు.. నేడు కూడా అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 170 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,370గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220గా కొనసాగుతోంది.
Also Read: Mayapetika : 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిన మాయా పేటిక..
నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో బుధవారం కిలో వెండి ధర రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,800గా ఉండగా.. చెన్నైలో రూ. 78,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,250 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,300ల వద్ద కొనసాగుతోంది.