Mayapetika : 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిన మాయా పేటిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన సినిమా మాయా పేటిక. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మేశ్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సునీల్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, హిమజ, శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరత్ చంద్రారెడ్డి, తారక్‍నాథ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అలాగే గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.
జూన్ 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది.. కాన్సెప్ట్ బాగున్నా కానీ సరిపడా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో పాటు ఈ మధ్య రీరిలీజుల ట్రెండ్ కూడా కొనసాగుతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మాయా పేటిక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా మాయాపేటిక ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. అదికూడా కేవలం నాలుగురోజుల్లోనే. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది . ‘హీట్ ఎక్కిపోతుంది. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ అంటే అంతేగా మరి’ అంటూ మాయాపేటిక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!