దేశంలో బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో తులం పసిడి రెండు వేలకు పైగా పెరిగింది. దాంతో పుత్తడి ధర 80 వేలకు చేరువైంది. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10.. 22 కారెట్లపై రూ.10 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళావారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.79,650గా నమోదైంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు బంగారం రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు కిలో వెండిపై రూ.100 పెరిగి.. బులియన్ మార్కెట్‌లో రూ.1,01,100గా కొనగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష పది వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి రూ.96,900గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,010
విజయవాడ – రూ.73,010
ఢిల్లీ – రూ.73,160
చెన్నై – రూ.73,010
బెంగళూరు – రూ.73,010
ముంబై – రూ.73,010
కోల్‌కతా – రూ.73,010
కేరళ – రూ.73,010
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,650
విజయవాడ – రూ.79,650
ఢిల్లీ – రూ.79,800
చెన్నై – రూ.79,650
బెంగళూరు – రూ.79,650
ముంబై – రూ.79,650
కోల్‌కతా – రూ.79,650
కేరళ – రూ.79,650
Also Read: IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,09,100
విజయవాడ – రూ.1,10,000
ఢిల్లీ – రూ.1,01,100
ముంబై – రూ.1,01,100
చెన్నై – రూ.1,09,100
కోల్‌కతా – రూ.1,01,100
బెంగళూరు – రూ.96,900
కేరళ – రూ.1,09,100