‘శ్రావణ మాసం’ కావడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జోరుగా జరుగుతున్నాయి. శుభకార్యాలకు బంగారం కొనేందుకు మగువలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బంగారం ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త అనే చెప్పాలి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 220 తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,650లుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,650గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,750 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.72,800గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా కొనసాగుతోంది.
Also Read: Raja Saab-Prabhas: సైలెంట్‌గా వస్తాం.. భారీ హిట్ కొడతాం!
మరోవైపు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. శుక్రవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ86,700గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.86,700లుగా ఉండగా.. చెన్నైలో రూ.91,700లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,000గా.. హైదరాబాద్‌లో రూ.91,700లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.91,700 వద్ద కొనసాగుతోంది.