మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది.. నిన్న మార్కెట్ తో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధర కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా, తాజాగా శనివారం ఒక్క రోజే మళ్లీ రూ. 200 తగ్గడం విశేషం..శనివారం 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి తులం గోల్డ్ ధర రూ. 59,840కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం..
*.ఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,940గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 54,850, 24 క్యారెట్స్ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది.
*. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,100, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్స్ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,840గా ఉంది.
*. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,850గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి బంగారం తగ్గితే.. వెండి కిలో పై భారీగా పెరిగింది.. శనివారం కిలో వెండిపై ఒకేసారి రూ. 1000 పెరుగుదల కనిపించడం గమనార్హం.. చెన్నెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 75,500కాగా, ఢిల్లీలో రూ. 75,500గా ఉంది. అలాగే కోల్‌కతాలో రూ. 75,500వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో రూ. 79,000 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..