Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Agenda: ఎన్నికలు ఏవైనా బరిలో గెలవాలన్నదే రాజకీయ నాయకుల లక్ష్యం. సాధ్యం అవుతాయా అన్న అంశం పక్కన పెడితే ఓటర్లను ఆకర్షించేందుకు చిత్రవిచిత్రమైన హామీలు ఇవ్వడం పరిపాటే. ఎదుటి వారు ఒకటిస్తానంటే నేను రెండిస్తానంటూ వరాలు కురిపిస్తారు. ఎంపీ నుంచి వార్డ్ మెంబర్ వరకూ తన పరిధి ఎంతవరకు అనే విషయం పట్టించుకోకుండా పోటీలో గెలవడమే వారికి కావాల్సింది.. ఆ కోవలోనే ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సందర్భంగా ఓటర్ల కోసం ప్రకటించిన మేనిఫెస్టో వింటే ముక్కున వేలేసుకుంటారు.
హర్యానాలోని సిర్సద్చెందిన జైకరణ్తన ఎన్నికల మేనిఫెస్టోని ఓ పోస్టర్రూపంలో ప్రచురించాడు. అందులో తాను సర్పంచ్‌గా గెలిస్తే తర్వాత గ్రామంలో మూడు విమానాశ్రయాలు నిర్మిస్తామని, మహిళలకు మేకప్ కిట్ ఉచితంగా ఇస్తామని, సిర్సాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.20కి, ఒక్కొక్కరికి ఒక్కో బైక్ ఇస్తామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి రోజుకు ఒక బాటిల్ మద్యం ఇస్తానన్నారు. సిర్సాద్ నుంచి గోహనా వరకు ప్రతి 5 నిమిషాలకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో తీసుకువస్తానన్నారు. జీఎస్టీ రద్దు చేసి, గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100, సిర్సాద్ నుంచి ఢిల్లీ వరకు మెట్రో లైన్, ఉచిత వైఫై సౌకర్యం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే దీన్ని చాలామంది ఫన్నీగా తీసుకుని షేర్ చేసుకుంటుండడంతో వైరల్‌గా మారింది.
Also Read
Read Also: Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ కంచికి.. ‘కో ఆపరేటివ్’గా లేదని లైసెన్స్ రద్దు
ఆ పోస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పోస్టర్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఆ గ్రామానికి షిఫ్ట్ అవుతున్నా’ అని ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!