బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. హమ్మయ్య గోల్డ్ ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే భగ్గుమంటున్నాయి. నేడు పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. 380 పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 551, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,755 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Srisailam Temple: శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగింది. దీంతో రూ. 87,550 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగింది. దీంతో రూ. 95,510 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,660 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 98,000 వద్ద ట్రేడ్ అవుతోంది.