బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఆకాశాన్నంటాయి. గోల్డ్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నేడు మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై ఏకంగా రూ.2,940 పెరిగింది. పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,338, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,560 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:Birth control pills : పిల్లలు కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే వారికి బిగ్ అలర్ట్..
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,700 పెరగడంతో రూ. 85,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,940 పెరగడంతో రూ. 93,380 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 93,530 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 400 జాబ్స్.. రాత పరీక్ష లేదు
బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు కిలో సిల్వర్ ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 95,000 వద్ద అమ్ముడవుతోంది.