కేంద్ర విద్యుత్ సంస్థ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. పరీక్ష రాయకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. GATE 2023, GATE 2024, లేదా GATE 2025 స్కోర్‌లు ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Also Read:Online Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటిన్నర పోగొట్టి.. పురుగుల మందు తాగిన వ్యక్తి!
గేట్ స్కోరు, వ్యక్తిగత ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గేట్ 2023, 2024, 2025 స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా తయారు చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ కోసం అభ్యర్థులను 1:12 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. జనరల్/EWS/OBC వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 500 నాన్-రీఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.