Site icon NTV Telugu

Godavari Floods: కాళేశ్వరం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Godavari Floods

Godavari Floods

Godavari Floods: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తడంతో గోదావరికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది. జాగ్రత్త పడ్డ అధికారులు భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేశారు. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో వరద ప్రవహిస్తోంది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచించారు. మరోవైపు.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్లో మొత్తం 85 గేట్లు ఎత్తి‌ దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 9,89,600క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు.

Read Also: Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ.3.50 కోట్లు మంజూరు

Exit mobile version