జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తడంతో గోదావరికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది.
ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల…