God : ఓటీటీ లోకి రాబోతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇరైవన్. తెలుగులో ఈ సినిమా గాడ్ గా రిలీజైంది. ఈ సినిమాలో జయం రవి సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 28 తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది.దీంతో రెండు వారాల తర్వాత తెలుగులో కూడా గాడ్ పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. అక్టోబర్ 13న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే అప్పుడే ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ గాడ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా గాడ్ స్ట్రీమింగ్ కానుంది.గాడ్ సినిమాలో వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, నరైన్, ఆశిష్ విద్యార్థి,చార్లీ, అశ్విన్ కుమార్ మరియు భగవత్ పెరుమాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం మరియు సి.హెచ్.సతీష్ కుమార్ ఈ ను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఎంతో కిరాతకంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పట్టుకుంటారు. అయితే ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా అమ్మాయిల హత్యలు జరుగుతూనే ఉంటాయి.. మరి అసలు వాళ్లని ఎవరు చంపుతారు..ఎందుకు చంపుతారో తెలుసుకోవాలంటే గాడ్ సినిమా చూడాల్సిందే.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!