Goat: మేకలు సాధారణంగా మహా అంటే 50కేజీల కంటే ఎక్కువ బరువు పెరగవు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకుంటే 25వేలలోపే దొరకుతుంది. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుటుంబం మేకను పెంచుకుంది. ఆ మేక ఏకంగా 100కేజీల బరువు పెరిగింది. దాని యజమాని నిర్ణయించిన ధర వింటే కళ్లు బైర్లు కమ్మేయటం ఖాయం. దాని ధర ఒక కోటి 12 లక్షల 786 రూపాయలుగా ఖరారు చేశాడు. కానీ పాపం బక్రీద్‌కు ముందే మేక హఠాత్తుగా చనిపోయింది. దీంతో యజమాని ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: OG: ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు ఏంటి సర్?
సిద్ధార్థ్ నగర్‌కు చెందిన షకీల్ అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్ ఎదురుగా బట్టల దుకాణం నడుపుతుంటాడు. దీనిపై ఆధారపడి కుటుంబం గడుస్తుంది. వ్యాపారంతో పాటు తనకు మేకలు పెంచడం అంటే ఇష్టం. దీంతో ఓ మేకకు ‘షేరు’ అని పేరు పెట్టి సాకడం మొదలు పెట్టాడు. అతని శరీరంపై ‘అల్లా’ , ‘మహమ్మద్’ అని ఉర్దూలో రాపించాడు. కుటుంబమంతా మేకను అల్లారుముద్దుగా చూసుకునేది.
Read Also:Bhatti Vikramarka: భట్టి పాదయాత్ర @100డేస్.. ట్విటర్లో #PeopelsMarch100Days ట్రెండింగ్
ఈ మేక షకీల్ ఇంట్లోనే పుట్టింది. మేకకు కేవలం 2 పళ్ళు మాత్రమే ఉన్నాయి. 100 కిలోల బరువు వరకు పెరిగింది. ఈ మేకను 1.25 కోట్లకు విక్రయించాలని షకీల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేకను విక్రయించడం ద్వారా గ్రామంలో పాఠశాల నెలకొల్పాలనుకున్నాడు. పాపం అతని కలలన్నీ నెరవేరకుండానే మేక చనిపోయింది. మేకకు ఉదయం, సాయంత్రం యాపిల్, ద్రాక్ష, మొక్కజొన్న, జీడిపప్పు, బాదం వంటి ఆహారాన్ని షేరుకు తినిపించేవాడని మేక యజమాని చెప్పాడు. గత కొన్ని రోజులుగా షేరు ఆరోగ్యం విషమించింది. మేకకు వైద్యం చేసేందుకు షకీల్ రోజూ దాదాపు రూ.2000 విలువైన మందులను వైద్యుడి వద్ద తీసుకునేవాడు. బక్రీద్ నాటికి షేరు నయమవుతుందని భావించాడు కానీ అది జరగలేదు. బక్రీద్ షేరు మృతితో షకీల్ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.