Yuvaraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా సర్కార్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvaraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు. గోవాలోని మోర్జిమ్ లో యువరాజ్ సింగ్ కు ఓ విలాసవంతమైన భవంతి ఉంది. ఈ భవనం పేరు ‘కాసా సింగ్’. ఈ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చాడు. ఒక విధంగా ఇది పేయింగ్ గెస్ట్ విధానం కిందికి వస్తుంది. ఈ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి.
Read Also: Hansika Motwani : పెళ్లి కూతురిలా ముస్తాబైన దేశముదురు భామ.. ఎంత అందంగా ఉందో..
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే, ఇంటిని పర్యాటకుల కోసం అద్దెకు ఇస్తామని యువరాజ్ సింగ్ ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం శాఖ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకం అని, అందుకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ వెల్లడించింది. హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గోవా సర్కారు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటీసులకు డిసెంబరు 8వ తారీఖున స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ ను గోవా ప్రభుత్వం ఆదేశించింది.
Goa Tourism Department issued notice to former cricketer Yuvraj Singh yesterday and initiated proceedings under the Registration of Tourist Trade Act for failure to register his villa, situated in Varchawada, Morjim, with the department: Department of Tourism, Goa
(File pic) pic.twitter.com/nppvoWp2Hr
— ANI (@ANI) November 23, 2022
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!